అడ్డుగోడ‌లా నిలిచిన‌ క్యారీ.. లంచ్ టైంకి ఆసీస్ స్కోర్

నవతెలంగాణ – ఇంగ్లడ్: ప్ర‌పంచ టెస్టు చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్లో మూడో రోజు తొలి సెష‌న్‌లో భార‌త్ పై చేయి సాధించింది. రెండు కీల‌క‌మైన వికెట్లు ప‌డ‌గొట్టారు. అయితే.. ఆఖ‌రి నాలుగు వికెట్లు మాత్రం చేయ‌లేక‌పోయారు. అందుకు కార‌ణం.. అలెక్స్ క్యారీ(41). మొద‌టి ఇన్నింగ్స్‌లో ఇన్నింగ్స్‌లో ధాటిగా ఆడిన అత‌ను మ‌ళ్లీ అడ్డుగోడ‌లా నిలిచాడు. కామెరూన్ గ్రీన్(25) ఔట‌య్యాక మిచెల్ స్కార్ట్‌(11)తో క‌లిసి ఇన్నింగ్స్ నిర్మించాడు. వీళ్లిద్ద‌రూ కీల‌కమైన 34 ప‌రుగులు జోడించారు. దాంతో, ఆసీస్ స్కోర్ రెండొంద‌లు దాటింది. లంచ్ బ్రేక్ వ‌ర‌కు క‌మిన్స్ సేన‌ 6 వికెట్ల న‌ష్టానికి 201 కొట్టింది. దాంతో, జ‌ట్టు 374 ర‌న్స్‌ ప‌రుగుల‌ ఆధిక్యంలో ఉంది. మూడో రోజు ఆసీస్‌ను తక్కువ‌కే ఆలౌట్ చేయాల‌నుకున్న భార‌త జ‌ట్టుకు ఉమేశ్ యాద‌వ్ బ్రేక్ ఇచ్చాడు. తొలి సెష‌న్ మొద‌లైన కాసేప‌టికే మార్న‌స్ ల‌బూషేన్(41)ను అత‌ను ఔట్ చేశాడు. స్లిప్‌లో పూజారా అద్భుత క్యాచ్ ప‌ట్ట‌డంతో ల‌బూషేన్ వెనుదిరిగాడు. ఆ త‌ర్వాత జ‌డేజా మ‌రో వికెట్ తీశాడు. క్రీజులో పాతుకుపోయిన ఆల్‌రౌండ‌ర్ కామెరూన్ గ్రీన్(25)ను బౌల్డ్ చేశాడు. దాంతో ఆరో వికెట్‌కు 43 ప‌రుగుల భాగ‌స్వామ్యానికి తెర‌ప‌డింది.

Spread the love