మూడో టీ20లో టాస్ గెలిచిన ఆసీస్..

నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రపంచ ఛాంపియ‌న్ ఆస్ట్రేలియాను వ‌రుస‌గా రెండు మ్యాచ్‌ల‌లో ఖంగుతినిపించి హ్యాట్రిక్ గెలుపుతో పాటు టీ20 సిరీస్‌ను సొంతం చేసుకునేందుకు యువ భార‌త్‌కు సువ‌ర్ణావ‌కాశం. విజ‌య‌వాడ‌, తిరువ‌నంత‌పురంలో మ్యాచ్‌ల‌ను గెలుచుకున్న భార‌త్.. నేడు గువ‌హ‌తి (అసోం) లోని బ‌ర్స‌ప‌ర వేదిక‌గా జ‌రుగుతున్న మూడో టీ20లో కూడా గెలిచి సిరీస్ గెలవాల‌నే ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌లో సూర్య‌కుమార్ యాద‌వ్ నేతృత్వంలోని టీమిండియా టాస్ ఓడగా.. టాస్ నెగ్గిన ఆసీస్ సార‌థి మాథ్యూ వేడ్‌ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. భార‌త్ బ్యాటింగ్ చేయ‌నుంది.
తుది జ‌ట్లుః
భార‌త్ః రుతురాజ్ గైక్వాడ్‌, య‌శ‌స్వీ జైస్వాల్‌, ఇషాన్ కిష‌న్, సూర్య‌కుమార్ యాద‌వ్ (కెప్టెన్‌), తిల‌క్ వ‌ర్మ, రింకూ సింగ్, అక్ష‌ర్ ప‌టేల్‌, ర‌వి బిష్ణోయ్‌, అర్ష్‌దీప్ సింగ్‌, అవేశ్ ఖాన్, ప్ర‌సిధ్ కృష్ణ
ఆస్ట్రేలియాః ట్రావిస్ హెడ్‌, ఆరోన్ హార్డీ, జోష్ ఇంగ్లిస్‌, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌, మార్క‌స్ స్టోయినిస్, టిమ్ డేవిడ్‌, మాథ్యూ వేడ్ (కెప్టెన్‌), నాథ‌న్ ఎల్లిస్‌, జేస‌న్ బెరెన్‌డార్ఫ్‌, త‌న్వీన్ సంఘా, కేన్ రిచ‌ర్డ్‌స‌న్

Spread the love