– బాలింతలు ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి
– ప్రభుత్వం పంపిణీ చేసే ఆహారం శక్తివంతమైనది
– తల్లిపాలు వారోత్సవాల్లో ఎంపీపీ అనురాధరమేష్
నవతెలంగాణ-పెద్దేముల్
బిడ్డ పుట్టిన గంటలోపు తల్లి నుంచి బిడ్డకు తప్పనిసరిగా ముర్రు పాలు ఇవ్వాలని ఎంపీపీ అనురాధ రమేష్ తెలిపారు. సోమవారం పెద్దేముల్ మండల కేంద్రంలో అంగన్‌వాడీ సెంటర్1లో అంగన్ వాడీ టీచర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ఎంపీపీ అనురాధ రమేష్, అంగన్‌వాడీ సూపర్‌వైజర్ రాణి, మీనాక్షి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ గర్భిణులు నీళ్లు ఎక్కువగా తీసు కోవాలని సూచించారు. బాలింతలు ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం సరఫరా చేసే ఆహారంలో శక్తివంతమైన విటమిన్లు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్స్ భాగ్యలక్ష్మి, కమిలి భాయి, రేణుక, ఆశావర్కర్ పుష్పలత, గర్భిణులు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.