చక్కెర పరిశ్రమ ప్రారంభం.. చెరకు సాగు ఒకేసారి

నవతెలంగాణ హైదరాబాద్‌: ఐదేండ్లలో రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) పూర్తి చేస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు తెలిపారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లోని నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు సిఫార్సుల కమిటీ సందర్శించింది. ఛైర్మన్ శ్రీధర్‌ బాబు, సభ్యులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి.. రైతులు, కార్మికులు, రాజకీయ పక్షాల అభిప్రాయాలను తెలుసుకున్నారు. చక్కెర పరిశ్రమను ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతోందని శ్రీధర్‌బాబు తెలిపారు. చక్కెర పరిశ్రమ ప్రారంభం, చెరకు సాగు ఒకేసారి జరగాలని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పరిశ్రమ పునరుద్ధరణపై ప్రత్యేక శ్రద్ధ చూపుతామన్నారు. లాభాల్లో ఉండే విధంగా ఫ్యాక్టరీని తిరిగి తెరిపించేందుకు ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. చెరకు రైతులకు పర్చేస్‌ ట్యాక్స్‌, సబ్సిడీని పరిశీలిస్తున్నామని, ట్రాన్స్‌ పోర్టు సబ్సిడీ, కొత్త వంగడాలపై దృష్టి సారించామని తెలిపారు.

Spread the love