నవతెలంగాణ – నిజాంసాగర్
మహమ్మద్ నగర్ మండలంలోని మగ్గంపూర్ గ్రామ శివారులోని నిజాంసాగర్ డిస్ట్రిబ్యూటర్ కాలువలో మహిళా మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించి పోలిస్ లకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న నిజాంసాగర్ ఎస్సై సుధాకర్ డిస్ట్రిబ్యూటర్ ఏడవ కెనాల్ వద్ద గుర్తుతెలియని ఆడ మనిషి శవం లభ్యమైందని ఆయన తెలిపారు. వయసు అందాజగా 50 నుండి 55 మధ్యలో ఉంటుందని నీలిరంగు చీర, పసుపు రంగు జాకెట్, మెరూన్ రంగు లంగా ధరించి ఉన్నదని ఆయన తెలిపారు. ఈ ఆడ మనిషి వివరాలు ఎవరికైనా తెలిస్తే 8712686172,8712686170 నంబర్లకు తెలుపగలరని ఆయన అన్నారు.