నవతెలంగాణ -ముధోల్: బాసర ట్రిపుల్ ఐటీలో సోమవారం ఉదయం పియుసి2 చదువుకుంటున్న ఆర్మూరు ప్రాంతానికి చెందిన విద్యార్థినిస్వాతి ప్రియ ఆత్మహత్య చేసుకుంది. వెంటనే మృతదేహాన్ని ముందుగా ట్రిపుల్ ఐటీ లో గల ఆస్పత్రికి తరలించారు. అయితే వెంటనే ట్రిపుల్ ఐటీ అంబులెన్స్ లో విద్యార్థిని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని కుటుంబ సభ్యులు వచ్చేంతవరకు ఆత్మహత్య గల కారణాలు బయటకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.