– సీపీఐ(ఎం) నగర కార్యదర్శివర్గ సభ్యుల నాగలక్ష్మి
– అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ వద్ద సంతకాల సేరణ
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
హైదరాబాద్‌లో మెట్రో రైలులో బోగీలను మూడు నుంచి ఆరుకు పెంచాలని సీపీఐ(ఎం) నగర కార్యదర్శివర్గ సభ్యులు నాగలక్ష్మి డిమాండ్ చేశారు. సోమవారం అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ వద్ద సీపీఐ(ఎం) హైదరాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మెట్రో రైళ్లలో రద్దీ విపరీతంగా ఉంటోందని.. మెట్రో రైలు ఎక్కాలన్నా, దిగాలన్నా ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఈ క్రమంలో కొందరు వారి స్టేషన్ దాటి పోయిన తర్వాత దిగిన సందర్భాలూ ఉన్నాయన్నారు. కావున మెట్రోకు మరో మూడు బోగీలు కలిపి ఆరు బోగీలు ేయాలని కోరారు. ఈ ఆరు కోచ్‌లకు సరిపోయేలా మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫాÛరం సిద్ధంగా ఉందని.. అయినా బోగీలను పెంచకుండా ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్న మెట్రో యాజమాన్యంపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తసుకోవాలని కోరారు. నగరంలో అన్ని మెట్రో స్టేషన్ల వద్ద ఆగస్టు 13, 14 తేదీల్లో సంతకాల సేకరణ చేపడతామని చెప్పారు. 17వ తేదీన బేగంపేట మెట్రో భవన్ వద్ద పెద్దఎత్తున ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నగర కమిటీ సభ్యులు రాపర్తి అశోక్, నాయకులు టి.సాయి శేషగిరిరావు, జె.స్వామి, బి.సోమేశ్ తదితరులు పాల్గొన్నారు.