చెరువులో పడి బాలుడు మృతి..

నవతెలంగాణ – దుబ్బాక రూరల్ : చెరువు గట్టున అడుకుంటూ ప్రమాదవశాత్తు చెరువులో పడి బాలుడు మృతిచెందిన సంఘటన దుబ్బాక మండల పరిధిలోని అప్పనపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.దుబ్బాక ఎస్ఐ గంగరాజు తెలిపిన వివరాల ప్రకారం కొమురవెల్లి మండలం గౌరయపల్లి గ్రామానికి చెందిన బండి నవీన తన పుట్టింట్లో జరిగే   దేవుని పండగ కోసం రెండు రోజుల క్రితం పిల్లలతో వచ్చింది.ఊరి చెరువు వద్దకు తన తల్లి,మరదలుతో కలిసి బట్టలు శుభ్రపర్చడానికి వెళ్తుండగా ముందుగా వారి వెంట వచ్చిన సాయికి తల్లి స్నానం చేయించి బయట ఆడుకోమని చెప్పింది. దీంతో సాయి చెరువు గట్టుపై ఆడుకుంటూ ప్రమాదవశాత్తు చెరువు నీటిలో మునిగిపోయాడు. సాయి కనిపించకపోవడంతో తన తమ్ముడు స్వామికి నవీన ఫోన్ చేసి విషయం చెప్పడంతో చెరువులో గాలింపు చేపట్టగా శవమై కనిపించాడు.మృతుడి తల్లి నవీన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ తెలిపారు.
Spread the love