రోడ్డుపైనే లెహంగాను విప్పేసి..ప్రియుడితో వెళ్లిపోయిన పెండ్లికూతురు

నవతెలంగాణ-హైదరాబాద్ :  జార్ఖండ్ లోని బడిదిహ్ జిల్లాలో అర్థరాత్రి జరిగిన ఓ పెండ్లి పీడకలలా మారింది. బడిదిహ్ గ్రామానికి చెందిన వీరేంద్ర సావ్ తన కొడుకు త్రిలోక్ కుమార్ కోసం మాల్దా గ్రామంలో నివసిస్తున్న సంపన్న కుటుంబంలోని అమ్మాయితో పెండ్లి నిశ్చయించారు. రెండు కుటుంబాలు.. బడిదిహ్‌లోని బగ్లాసోట్ శివాలయంలో పెండ్లి జరపాలని నిర్ణయించుకున్నారు. సోమవారం అర్థరాత్రి.. పెళ్లి బృందం పెండ్లికి, రిసెప్షన్‌కు వచ్చింది. గుడికి వచ్చిన వరుడికి బంధువులు, స్థానికులూ ఆనందంగా ఘన స్వాగతం పలికారు. అయితే.. ముహూర్తానికి టైమ్ దగ్గర పడింది.. మరో ఐదు నిమిషాల్లో వధూవరులు దండలు మార్చుకోవాల్సి ఉండగా.. ఇంతలో వధువు.. ఓ హారం వేసుకోవడం మర్చిపోయాననీ చెప్పి.. 5 నిమిషాల్లో ధరించి వస్తానని ఓ గదిలోకి వెళ్లింది. దీంతో వధువు సడెన్‌గా అలా వెళ్లడంతో.. పెండ్లికి వచ్చిన వాళ్లంతా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటు ఉండిపోయారు. 5 నిమిషాల తర్వాత కూడా వధువు రాకపోవడంతో ఆమె వెళ్లిన గదిలోకి వెళ్లి చూడగా.. అక్కడ ఆమె లేదు. అక్కడికి 300 మీటర్ల దూరంలో ఓ కుర్రాడు బైక్‌పై వెయిట్ చేస్తున్నాడు.. ఇంతలోనే పెండ్లికూతురు.. రోడ్డుపై పరుగెడుతూ.. లెహంగాను రోడ్డుపైనే వదిలేసి అతనితో లేచిపోయింది. ఇక.. ఈ విషయం తెలిసిన రెండు కుటుంబాలవారూ షాక్ అయ్యారు. ఆమె కోసం ఆ రాత్రి వెతికినా వధువు కనిపించలేదు. వధువు తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టారు.

Spread the love