నవతెలంగాణ – అమరావతి: బ్రిడ్జి కూలిపోవడంతో వరి ధాన్యంతో వెళుతున్న ఈచర్ వాహనం నీళ్లలో పడి వరి ధాన్యపు బస్తాలు నీటిపాలైన ఘటన మంగళవారం రాయదుర్గంలో జరిగింది. రాయదుర్గం నియోజకవర్గం కనేకల్ మండలంలో గంగులాపురం కనేకల్ రహదారిపై ఈచర్ వాహనం వరి ధాన్యంతో వెళుతుండగా ఒక్కసారిగా బ్రిడ్జి కూలడంతో రైతు పండించిన వరి ధాన్యం గంగలో కలిసిపోయింది. పైకి తీయడానికి వీలుగా ఉన్న కొన్ని బస్తాలను స్థానికుల సాయంతో బయటకు తీసేందుకు ప్రయత్నించారు.