మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే..

The BRS government will come again.– మాజీ మంత్రి గుంట కండ్ల జగదీశ్వర్ రెడ్డి
– విద్యార్థి యువజన విభాగం ఆధ్వర్యంలో పాదయాత్రను ప్రారంభించిన మంత్రి..
నవతెలంగాణ – భువనగిరి
మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. టిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రజోత్సవ మహాసభ జయప్రదం కావాలని కోరుతూ వలిగొండ మండలం మస్తగిరిగుట్ట వద్ద నుంచి యాదగిరిగుట్ట వరకు టిఆర్ఎస్ యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన పాదయాత్రను జగదీష్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. ఆనాడు స్వరాష్ట్రం కోసం కెసిఆర్ చర్చలో తెలంగాణ వచ్చుడు అనే నినాదంతో ముందుకెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు. రైతును రాజు చేసింది కేసీఆర్ అయితే అన్నదాత వెన్ను విరిచింది కాంగ్రెస్ ప్రభుత్వం అని విమర్శించారు.  కాంగ్రెస్ ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిందని, దీంతో ప్రజలు  నమ్మి మోసపోయారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనతో విసుగు చెందిన తెలంగాణ ప్రజలందరూ కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలని కోరుతున్నారని పేర్కొన్నారు.  విద్యార్థి యువజన విభాగం టిఆర్ఎస్ రజతోత్సవాల సమయంలో పండు వేసవిని లెక్కచేయకుండా  పాదయాత్ర చేయడం అభినందనీయమన్నారు. వారికి కెసిఆర్ మీద బిఆర్ఎస్ మీద ఉన్న ప్రేమ మనకు అర్థమవుతుందన్నారు.
ఇదే తరహాలో రాష్ట్రస్థాయిలో బిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు పనిచేస్తున్నారని తెలిపారు. ఈనెల 27న వరంగల్లో జరిగే టిఆర్ఎస్ రజోత్సవ సభను చరిత్రలో నిలిచేలా విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు   పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే గాదారి కిషోర్ మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక పొయ్యారన్నారు . రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రశ్నిస్తే భౌతిక దాడులు చేస్తూ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ఈ లంగా దొంగ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తరిమికొరడానికి బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాపాలన పేరుతో ప్రజావ్యతిరేక విధానాల అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో ఎండబెట్టడానికి యువత ముందుకు రావాలని కోరారు. ప్రజలందరూ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలోటిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బూడిద బిక్షమయ్యగౌడ్,  రాష్ట్ర నాయకులు నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి, గొంగిడి మహేందర్ రెడ్డి, క్యామ మల్లేష్, రైతు సమన్వయ సమితి జిల్లా మాజీ అధ్యక్షులు కొలుపుల అమరేందర్, పైళ్ల రాజవర్ధన్ రెడ్డి, వనమల కృష్ణ, తుమ్మల వెంక రెడ్డి, బూరుగు నవీన్ గౌడ్, మట్ట ధనంజయ గౌడ్, రమేష్, మొగోల్ల శ్రీనివాస్, కొమురెల్లి సంజీవరెడ్డి, పడమటి మమత, మంజుల, పలుసం రాజు, ఎండి అప్రోచ్, ప్రశాంత్, అవినాష్  పాల్గొన్నారు.
పాదయాత్రకు అడుగడుగున స్వాగతం..
బి ఆర్ ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో టిఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం కావాలని వలిగొండ మండలం మత్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం నుండి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం వరకు నిర్వహిస్తున్న పాదయాత్రకు  అడుగు అడుగున ప్రజలు బిఆర్ఎస్ శ్రేణులు స్వాగతం పలుకుతున్నారు. మస్తగిరి దేవాలయం నుండి ప్రారంభమైన పాదయాత్ర ముందు డోల్ వాయిద్యాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాదయాత్ర సభ్యులకు పూలమాలలు వేసి బీఆర్ఎస్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. పాదయాత్రకు నిర్వహిస్తున్న యువతతో పాటు బిఆర్ఎస్ శ్రేణులు వారితో నడిచారు.
Spread the love