నవతెలంగాణ-హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామ వీరభద్రనగర్ కాలనీలో గురువారం దారుణం జరిగింది. తల్లీకొడుకులను నడిరోడ్డు మీద కత్తితో పొడిచి హత్య చేయడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ హత్యలకు పాతకక్షలే కారణమని తెలుస్తోంది. పాత కక్షలే కారణంగా… వీరభద్రనగర్‌లో అనిల్ (30), అతను తల్లి సరోజదేవి (50) నివాసం ఉంటున్నారు. అయితే తన రెండేళ్ల కుమారుడు మృతికి కారణం వీరిద్దరే అని భావించిన బిహరీకి చెందిన నాగరాజు కక్ష పెంచుకున్నాడు. గురువారం ఉదయం నడిరోడ్డుపై తల్లీకొడుకులను కత్తితోపొడిచి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నిందితుడు నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.