దారుణం.. బీజేపీ నేతను నరికి చంపిన దుండగులు

నవతెలంగాణ -తమిళనాడు: తమిళనాడులో తిరుప్పూర్ జిల్లా పల్లడం దారుణం చోటు చేసుకుంది. బీజేపీ నేతను నరికి చంపారు కొంత మంది దుండగులు. దీంతో బీజేపీ నేత కుటుంబ హత్య తమిళనాడులో సంచలనంగా మారింది. ఇంటి ముందు మద్యం తాగవద్దని చెప్పడంతో బీజేపీ నేత మోహన్ రాజ్ కుటుంబాన్ని నరికి చంపారు.  మోహన రాజ్ సహా నలుగురు కుటుంబ సభ్యులను ఆ దుండగులు చంపారు.  ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. సిసి కెమేరాల ద్వారా విచారణ వేగవంతం చేశారు పోలీసులు. హత్యలకు ఇంటి వద్ద జరిగిన మద్యం గొడవే కారణమా లేక రాజకీయ కారణం అనే కోణంలో విచారణ చేస్తున్నారు.

Spread the love