– ఎస్.ఎస్ కామెడీ కపుల్స్ సంధ్య, శ్రీకాంత్
– ఘనంగా రాజధాని పాఠశాల ”ప్రేరణమహౌత్సవ్”2కే 2ఫోర్ వార్షికోత్సవ వేడుకలు
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట/కూకట్‌పల్లి
నవసమాజ నిర్మాతలు నేటి విద్యార్థులేనని, పట్టుదలతో చదివితే ఉన్నత శిఖరాలదిరో హిస్తారని ఎస్.ఎస్ కామెడీ కపుల్స్ సంధ్య శ్రీకాంత్‌లు అన్నారు. శనివారం సాయంత్రం జగద్గిరిగుట్ట పాపిరెడ్డి నగర్‌లోని రాజధాని హై స్కూల్ ( ప్రేరణ మహౌత్సవ్… 2 కే 2 ఫోర్) వార్షికోత్సవ వేడుకలు పాపారాయుడు నగర్‌లోని అశోక గార్డెన్స్‌లో విద్యార్థుల కేరింతల నడుము ఉల్లాసంగా ఉత్సాహంగా కొనసాగింది. ముందుగా ఈ కార్యక్రమాన్ని పాఠశాల చైర్మెన్, కర స్పాండెంట్ యాద నరేంద్ర గుప్తతో పాటు పాఠశాల డైరెక్టర్లు, ఉపాధ్యా యులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్ర మాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల మనోభావాలకు అనుగుణంగా తల్లిదండ్రుల ప్రోత్సహించాలని అప్పుడే వారు అనుకున్న గమ్యాన్ని సాధిస్తానన్నారు. విద్యతో పాటు, క్రీడలు, సామాజిక విలువల పట్ల ఆసక్తి పెంచుకోవాలని అప్పుడే సమాజం లో మంచి గుర్తింపు పొందుతారని ఆకాంక్షించారు. క్రమశిక్షణతో కూడిన విద్యనం దిస్తున్న యాజమాన్యాన్ని, ఉపాధ్యాయులను వారు ప్రత్యేకంగా అభినందించారు. పాఠశాల చైర్మెన్, కర స్పాండెంట్ యాద నరేంద్ర గుప్త మాట్లాడుతూ తమ పాఠశాలలో అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యాబుద్ధులు నేర్పుతూ భావిభారత పౌరులుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ ప్రాంతంలో తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యనందిస్తూ ప్రతి సంవత్సరం ఎస్.ఎస్.సి.లో ఉత్తమ ఫలితాలు సాధిస్తూ ఈ ప్రాంతానికే తలమాణికంగా తమ పాఠశాల విద్యార్థులు నిలుస్తున్నారన్నారు. అనంతరం విద్యార్థులు చేసిన ‘రామాయణం’ ప్రదర్శన అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. చిన్నారి విద్యార్థుల సాంస్కతిక ప్రదర్శ నలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.