రిక్షాపై దూసుకెళ్లిన బస్సు.. 8 మందికి..

నవతెలంగాణ హైదరాబాద్: రిక్షాపైకి బస్సు దూసుకెళ్లిన ఘటనలో బస్సులోని 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వినడానికి విచిత్రంగా ఉన్నా.. వాస్తవంగా ఇది జరిగింది. ఓ రిక్షావాలా ఇనుప చువ్వల లోడ్‌ తీసుకుని రోడ్డుపై వెళ్తున్నాడు. వెనుక నుంచి వేగంగా వచ్చిన బస్సు రిక్షాపైకి దూసుకెళ్లింది. దాంతో రిక్షాపై ఉన్న ఇనుప చువ్వలు బస్సు కిటికిల్లోంచి లోనికి దూసుకెళ్లి ప్రయాణికులకు గుచ్చుకున్నాయి.
ఈ ఘటనలో బస్సులోని 8 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. అయితే రిక్షా కార్మికుడు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. గుజరాత్‌ రాష్ట్రం బనస్కాంత జిల్లా, దిసా తాలూకాలోని బనాస్‌పూల్‌ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Spread the love