ఆర్టీసీ కార్మికుల సమస్యలపై క్యాబినెట్‌ నిర్ణయం తీసుకోవాలి

– టీఎస్‌ఆర్టీసీ జేఏసీ డిమాండ్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంపై నిర్ణయం తీసుకోవాలని టీఎస్‌ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు జేఏసీ చైర్మెన్‌ ఈ అశ్వత్థామరెడ్డి, కన్వీనర్‌ కే హన్మంతు ముదిరాజ్‌ ఆదివారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీ కార్మికులకు రావల్సిన రెండు వేతన సవరణలు, పెండింగ్‌ బకాయిలు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం పదేండ్లుగా ఆర్టీసీ కార్మికులకు అనేక హామీలు ఇచ్చిందనీ, కానీ ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. చట్ట వ్యతిరేక డ్యూటీలతో కార్మికులు ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా మనోవేదనకు గురై ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సంస్థలో కార్మిక సంఘాల కార్యకలాపాలను అనుమతించి, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని కోరారు. సీసీఎస్‌ బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.

Spread the love