జోరుగా కాంగ్రెస్ గడప గడపకు ఆరు గ్యారంటీల ప్రచారం

 – భారీగా స్పందన
నవతెలంగాణ- మల్హర్ రావు: మండలంలోని అడ్వాలపల్లి గ్రామంలో తెలంగాణ కాంగ్రేస్ మేనిపేస్టో చైర్మన్, మంథని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దిళ్ల శ్రీదర్ బాబును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆరు గ్యారెంటీ కార్డులతో గడప గడపకు మంగళవారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రచారం చేపట్టారు. ప్రజల నుంచి భారీగా స్పందన వస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వంద రోజుల్లో సోనియాగాంధీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలు అమలు చేయడం జరుగుతుందన్నారు. ప్రజలు కేసీఆర్ మాయమాటలు నమ్మొద్దన్నారు. పేదల పక్షపాతి కాంగ్రెస్ పార్టీని ఆదరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ డైరెక్టర్లు  ఇప్ప మొoడయ్య, కిషన్ నాయక్, సర్పంచ్ రాజు నాయక్, జిల్లా కాంగ్రెస్ పార్టీ యూత్ కార్యదర్శి రాహుల్, గ్రామశాఖ అధ్యక్షుడు అజ్మీరా రాజు, నాయకులు చంద్రు నాయక్, శ్రీనివాస్, మహేష్, రవి, పొచయ్య, రాజశేఖర్, రత్నాకర్, సంపత్ పాల్గొన్నారు.
Spread the love