చెరువులోకి దూసుకెళ్లిన కారు..

The car crashed into the pond.నతెలంగాణ – హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల పరిధిలో కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకుపోయింది. షాద్‌నగర్‌కు చెందిన మల్లేశ్వరరావు అనే వ్యక్తి కేశంపేట మండల పరిధిలోని వేమలనర్వలో ఉన్న తన పౌల్ట్రీ ఫామ్‌ వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా కారు అదుపు తప్పింది. రహదారి పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. ఇది గమనించిన గ్రామస్థులు వెంటనే చెరువు వద్దకు చేరుకొని అతన్ని సురక్షితంగా బయటకు తీశారు. చెరువు లోతు తక్కువగా ఉండడంతో బాధితుడు స్వల్పగాయాలతో బయటపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని జేసీబీ సాయంతో కారును బయటకు తీశారు.

Spread the love