గద్వాలలో కారు.. జోరు

జోగులాంబ గద్వాల: 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యే బండ్ల కష్ణమోహన్‌ రెడ్డి రెండోసారి విజయం సాధిచారు. గద్వాల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి సరితపై.. 7631 ఓట్ల తేడాతో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బండ్ల కష్ణమోహన్‌రెడ్డి గెలుపొందాడు. బీ ఆర్‌ఎస్‌ అభ్యర్థికి బండ్ల కష్ణమోహన్‌ రెడ్డికు 93,720 ఓట్లు రాగా కాంగ్రెస్‌ అభ్యర్థి సరితకు 86,039ఓట్లు, బీజేపీ అభ్యర్థి శివారెడ్డికి 7422, ఇండిపెండెంట్‌ అభ్యర్థి రంజిత్‌ కుమార్‌ కు 13,429 వచ్చాయి. బండ కష్ణమోహన్‌రెడ్డి మొదటి రౌండ్‌ నుంచి సరితపై ఆధిక్యం సాధిస్తూ వస్తున్న ప్పటికీ మధ్యలో సరిత కష్ణమోహన్‌ రెడ్డి ఆధిక్యతను తగ్గించినప్పటికీ చివరిగా గద్వాల నియోజకవర్గం 22 ఎన్నికల రౌండ్‌ ఫలితాలలో బీ ఆర్‌ఎస్‌ అభ్యర్థి బండ్ల కష్ణ మోహన్‌ రెడ్డి 7681 వేల ఓట్ల మెజారిటీతో సమీప కాంగ్రెస్స్‌ అభ్యర్థి సరితపై విజయం సాధించారు. ఓట్ల శాతం విషయానికి వస్తే.. బీఆర్‌ఎస్‌కు 93,720ఓట్లు రావడం ఓట్ల 43.94 శాతం, కాంగ్రెస్స్‌ పార్టీ అభ్యర్థికి 86,039 ఓట్లు సాధించగా 40.34 శాతం , కేవలం 3.6శాతం ఓట్ల తో కాంగ్రెస్స్‌ అభ్యర్థి సరిత వెనుకంజవేశారు.

Spread the love