కేంద్రం ఒక్కరికీ ఇల్లివ్వలే…

రాష్ట్రంలో గుడిసెలు వేసుకున్న వారికి ఇంటి స్థలం ఇవ్వాలి
– పోలీసులతో దాడి చేయడాన్ని మానండి : కొత్తగూడెం సభలో వీరయ్య, సుదర్శన్‌, లక్ష్మి
నవతెలంగాణ – కొత్తగూడెం
”భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదలకు ఇంటి స్థలం పట్టాలు, ఇండ్లు మంజూరు చేయాలి.. పేదలపై పెట్టిన కేసులు ఎత్తేయాలి” అని తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్‌ ఎస్‌.వీరయ్య, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఇండ్ల సాధనకై ప్రజాసంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో మహబూబాబాద్‌లో ప్రారంభించిన బస్‌యాత్ర సోమవారం కొత్తగూడెం చేరుకుంది. కొత్తగూడెం రైల్వేస్టేషన్‌ వద్ద ఎజె.రమేష్‌ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో వారు మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒక్క పేదవాడికి కూడా ఇల్లు ఇవ్వలేదని విమర్శించారు. లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్లకు కట్టబెడుతున్న మోడీ ప్రభుత్వం పేదలను మాత్రం మోసం చేస్తున్నదన్నారు. రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తులను కూడా కలుపుకుంటే అన్నదాతలకు ఆర్థికంగా కలిగిన నష్టం మరింత అధికంగానే ఉంటుంది. పీఎం కిసాన్‌ పథకం కింద ఇచ్చిన మొత్తంతో పోలిస్తే ఈ నష్టం చాలా చాలా ఎక్కువ.
ప్రభుత్వం అక్కడక్కడ డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు నిర్మించి ఇచ్చిందని, కానీ పేదలందరికీ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పేదల ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.15 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకొన్న పేదలపై పెట్టిన కేసులు ఎత్తేయాలని డిమాండ్‌ చేశారు. కొత్తగూడెంలో గుడిసెలు వేసుకున్న పేదలందరికీ ఇంటి పట్టాలు, ఇండ్లు ఇచ్చిన తరువాతే ఇక్కడి అధికార పార్టీ నాయకులు రానున్న ఎన్నికల్లో పోటీలో ఉండాలని సూచించారు. రాష్ట్రంలో గుడిసెలు వేసుకున్న ప్రాంతాల్లో పేదలపై గూండాలు, పోలీసులతో దాడులు చేస్తున్న ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు మానుకోవాలని, లేనిపక్షంలో సరైన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద కొత్తగూడెం జిల్లాలో ఒక్క ఇల్లు అయినా కట్టారేమో చూపించాలన్నారు. పేదలకు ఇల్లు ఇవ్వకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పతనం ఖాయం అన్నారు. పేదలందరికీ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక రాష్ట్ర నాయకులు పి.ఆశయ్య, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకట్రాములు, కేవీపీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్‌ బాబు, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్‌, సోషల్‌ మీడియా నాయకులు జగదీష్‌, ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు వేముల ఆనంద్‌, జీఎంపీఎస్‌ రాష్ట్ర నాయకులు కాసాని అయిలయ్య, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, నాయకులు మచ్చ వెంకటేశ్వర్లు, ఏజె రమేష్‌, కె.బ్రహ్మచారి, రేపాకుల శ్రీనివాస్‌, అన్నవరపు సత్యనారాయణ, లిక్కి బాలరాజు, కొండపల్లి శ్రీధర్‌, భూక్యా రమేశ్‌, కాలంగి హరికృష్ణ, ఎస్‌.లక్ష్మి, వాణి, బుర్ర వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.
నెడుతోంది.

Spread the love