ఈ నెలాఖరులోగా గనులను వేలం వేయండి: కేంద్రం

నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్రంలోని గనుల్లో కనీసం 6 బ్లాకులకు ఈ నెలాఖరులోగా వేలం నిర్వహించాలని కేంద్ర గనుల శాఖ రాష్ట్ర సర్కారుకు ఓ లేఖలో తేల్చిచెప్పింది. గడచిన తొమ్మిదేళ్లలో ఒక్క గనిని కూడా వేలం వేయలేదని తెలిపింది. ఒకవేళ ఈ ప్రక్రియలో రాష్ట్రం విఫలమైతే తామే వేలం చేపడతామని తేల్చిచెప్పింది. 2015లో మినరల్ బ్లాకుల వేలం ప్రక్రియ అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా 354 మేజర్ మినరల్ బ్లాకులను వేలం వేశారు.

Spread the love