మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పిల్లలకు మనం ఇచ్చే విలువైన ఆస్తి విద్య మాత్రమే
మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
సమాజానికి సేవ చేయడమే రాజకీయ నేత లక్షణం అని చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. సందయ్య మెమోరియల్ ట్రస్ట్ సహకారం తో శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే ఎం.భిక్షపతి యాదవ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో లింగంపల్లిలోని ప్రభుత్వ పాఠ శాలలో విద్యార్దులకు నోటు పుస్తకాల పంపిణీ చేశా రు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి హాజరై మాట్లాడారు.. సమాజ సేవ చేయడానికి యువత రాజకీయాల్లోకి రావాలని సూ చించారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కోసం సహ కరిస్తున్న రవికుమార్ యాదవ్‌ను అభినందించారు. భిక్షపతి యాదవ్ లాంటి మంచి నేతను అందించిన ఘనత లింగంపల్లి పాఠశాలకు దక్కిందన్నారు. మాజీ ఎమ్మెల్యే ఎం.భిక్షపతియాదవ్ మాట్లాడుతూ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పిస్తేనే విద్య సజావుగా సాగుతుందనీ కనీస వసతులు లేకుండా విద్యార్ధులు ఏలా చదువుతారని ప్రశ్నించారు. పిల్లలకు మనం ఇ చ్చే ఆస్తి విద్య మాత్రమే అన్నారు. పాఠశాలలకు తనవంతు సహకారం అందిస్తున్నట్టు తెలిపారు. లిం గంపల్లి పాఠశాల అభివృద్ధికి మారబోయిన సదానం దయాదవ్ రూ.లక్షా విరాళంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాఘవేంద్రరావు, వెంకటరెడ్డి పటేల్, సోమయ్య యాదవ్, నరసింహ యాదవ్, విజరు కు మార్, నవతారెడ్డి, కంచర్ల ఎల్లేష్, రాధాకృష్ణ యాదవ్, నాగుల్ గౌడ్, రమేష్, ఆంజనేయులు సాగర్, పద్మ, అరుణ, విజయలక్ష్మి, రేణుక, పార్వతి, నాగులు, నరసింహ, ఆకుల లక్ష్మణ్, రమేష్, గణేష్ ముదిరాజ్, శ్రీనివాస్, జే.శ్రీను, మల్లేష్, వినరు, కిట్టు, రవి, అశోక్, కృష్ణ, రామకృష్ణ, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.