మరణించిన సిబ్బంది కుటుంబానికి చెక్ పంపిణి చేసిన ఇంచార్జీ పోలీస్ కమీషనర్

నవతెలంగాణ -కంటేశ్వర్
పోలీస్ శాఖలో మరణించిన సిబ్బంది కుటుంబానికి చెక్కును ఇన్చార్జ్ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సిహెచ్ ప్రవీణ్ కుమార్ అందజేశారు. అందులో భాగంగా తేది:1-3-2023 రోజున ఎన్. రవి, కానిస్టేబుల్ 1534, టౌన్ 4 పి.యస్ గారు అనారోగ్యంతో మరణించడం జరిగింది. భద్రత ఎక్సిగ్రేషియా రూపంలో గల చెక్కు రూ॥ 8,00,000/- ( ఎనిమిది లక్షల రూపాయల) చెక్కును నేడు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఇంచార్జీ పోలీస్ కమీషనర్  సి.హెచ్. ప్రవీణ్ కుమార్, ఐ.పి.యస్ చేతుల మీదుగా కీ॥ శే॥ ఎన్.రవి సతీమణి అయిన ఎన్. జయవిజయకి చెక్కును అందజేయడం జరిగినది. ఈ సందర్భంగా అదనపు పోలీస్ కమీషనర్ (అడ్మిన్) జి. మధుసుదన్ రావు, నిజామాబాద్ ఎసిపి. కిరణ్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్  శ్రీశైలం, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు షకీల్ పాషా వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love