క్లైమాక్స్‌ అందర్నీ సర్‌ప్రైజ్‌ చేస్తుంది

The climax will surprise everyone”సంక్రాంతికి వస్తున్నాం’లో ఎక్స్‌ కాప్‌, ఎక్స్‌ గర్ల్‌ఫ్రెండ్‌, ఎక్స్‌లెంట్‌ వైఫ్‌.. ఈ లైనే చాలా ఫ్రెష్‌గా అనిపించి, సినిమా చేశాను’ అని హీరో వెంకటేష్‌ చెప్పారు.
అనిల్‌ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ కాంబినేషన్‌లో వెంకటేష్‌ హీరోగా రూపొందిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్‌ రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్‌ హీరోయిన్స్‌గా నటిం చారు. ఈ సినిమా ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా హీరో వెంకటేష్‌ మీడియాతో ముచ్చటించారు.
నా కెరీర్‌లో ఇది మరో సంక్రాంతి సినిమా. ఒక క్లీన్‌ ఎంటర్‌టైనింగ్‌ ఫిల్మ్‌తో రావడం చాలా ఆనందంగా ఉంది. ఇందులో ఓ చిన్న క్రైమ్‌ ఎలిమెంట్‌తోపాటు న్యూ జోనర్‌ కూడా ఉంది. నా కెరీర్‌లో సంక్రాంతికి వచ్చిన చాలా సినిమాలు చాలా బాగా ఆడాయి. ఈ సినిమా కూడా అద్భుతంగా ఆడుతుందనే నమ్మకం ఉంది.
దర్శకుడు అనిల్‌, నాది సూపర్‌ హిట్‌ కాంబినేషన్‌. పెర్ఫార్మెన్స్‌ వైజ్‌ ఇందులో కామెడీ స్టయిల్‌ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. చాలా సెటిల్డ్‌గా, కొత్తగా ట్రై చేశాం. ఫ్రెష్‌ సీన్స్‌ ఉంటాయి. సినిమా అద్భుతంగా వచ్చింది. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్‌ ఇద్దరూ చాలా మంచి క్యారెక్టర్స్‌ చేశారు. చక్కగా నటించారు. వీళ్ళ క్యారెక్టర్స్‌ చాలా క్రేజీగా ఉంటాయి.
భీమ్స్‌ చాలా హార్డ్‌ వర్క్‌ చేసి బెస్ట్‌ మ్యూజిక్‌ ఇచ్చాడు. తనకి ఈ సినిమా మంచి బ్రేక్‌ ఇస్తుందనే నమ్మకంతో చేశాడు. ఫస్ట్‌ ట్యూన్‌ వినగానే హిట్‌ అనుకున్నాం. అది సూపర్‌ బ్లాక్‌ బస్టర్‌ అయ్యింది. ‘గోదారి గట్టు’ పాట 85 మిలియన్‌ వ్యూస్‌ క్రాస్‌ చేసింది. నాతో ‘పొంగల్‌’.. సాంగ్‌ పాడించాలనే ఆలోచన నాదే. నైట్‌ రెండు గంటలకి ఆ సాంగ్‌ విన్నప్పుడు తెలియకుండానే డ్యాన్స్‌ చేశాను. ఏదో క్రేజీ ఎనర్జీ ఆ సాంగ్‌లో ఉంది. సరదాగా నేనే పాడతానని అన్నాను. ఆ రోజు గొంతు బాగానే ఉంది. ఇంగ్లీష్‌ వర్డ్స్‌ ఉండటంతో నాకు ఇంకా ఈజీ అయ్యింది (నవ్వుతూ). ఇందులో రమణ గోగుల పాడిన ‘గోదారి గట్టు’ పాట పెద్ద హిట్‌ అయ్యింది.
ఇందులో క్లైమాక్స్‌లో చెప్పే డైలాగ్స్‌ చాలా క్రేజీ ఉంటాయి. ప్రేక్షకులు చాలా ఎంటర్‌టైన్‌ అవుతారు. డైలాగ్స్‌ని యూత్‌ చాలా లవ్‌ చేస్తారు. అన్నింటికీ మించి క్లైమాక్స్‌ అందర్నీ సర్‌ప్రైజ్‌ చేస్తుంది. దిల్‌ రాజు ప్రొడక్షన్‌లో ‘సీతమ్మ వాకిట్లో..’ నుంచి ట్రావెల్‌ అవుతున్నాను. వారితో జర్నీ చాలా కంఫర్ట్‌బుల్‌గా ఉంటుంది. మేం చేసిన సినిమాలన్నీ బాగా ఆడాయి. వారికి మరిన్ని విజయాలు రావాలని కోరుకుంటున్నాను.

హానెస్ట్‌ అండ్‌ సిన్సియర్‌గా వర్క్‌ చేయడమే మన చేతిలో ఉంటుంది. హిట్స్‌, ఫ్లాప్స్‌ మన చేతిలో ఉండవు. మన కంట్రోల్‌లో లేని విషయాలు గురించి నేను ఎక్కువ థింక్‌ చేయను. నా సోషల్‌ మీడియా అకౌంట్స్‌ నుంచి చాలా పాజిటివ్‌ పోస్టులు రావడానికి కారణం ఒక్కటే.. లైఫ్‌లో పాజిటివ్‌గా ఉండాలి. ఓవర్‌ థింకింగ్‌ అనవసరం. ఓ పాజిటివ్‌ థాట్‌తో రోజు మొదలు పెడితే జీవితం చాలా హాయిగా ఉంటుంది.
– వెంకటేష్‌

Spread the love