నవతెలంగాణ – బంజారా హిల్స్
హైదరాబాద్‌లోని లేక్ వ్యూ గెస్ట్‌హౌస్ వద్ద వరద నివారణ కోసం నిర్మిస్తున్న రెయిన్ వాటర్ సంప్ పనులను సీఎం రేవంత్ రెడ్డి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వరద నివారణపై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. రోడ్లపై వరదను మళ్లిస్తే నగరంలో ట్రాఫిక్ జామ్‌లను తగ్గించవచ్చని సూచించారు. వచ్చే వర్షాకాలం నాటికి అన్నీ చోట్ల పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రైయిన్ వాటర్ సంప్‌ల డిజైన్ మార్చాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ వ్యాప్తంగా గుర్తించిన 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర రెయిన్ వాటర్ సంపులను నిర్మించాలని ఆదేశించారు. సీఎంతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిశోర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇళంబర్తి, సీఎం స్పెషల్ సెక్రెటరీ అజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఇంజినీరింగ్ అధికారులు తదితరులు ఉన్నారు.