ప్రజా సంరక్షక పాలన కొనసాగిస్తున్న సీఎం

– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌
నవతెలంగాణ-గోదావరిఖని:
తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డాక సీఎం కేసీఆర్‌ పాలనలో అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రజా సంరక్షక పాలన కొనసాగుతుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ అన్నారు. మంగళవారం తిలక్‌నగర్‌లోని విశ్వం ఫంక్షన్‌ హాల్‌ లో ఏర్పాటు చేసిన రాజన్నల సంఘం ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాలు ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరుగుతుందడడంతో రాష్ట్ర ఉద్యమంలో పాల్గొనడం జరిగిందన్నారు. ప్రజల ఆకాంక్షల నెరవేర్చడమే నా బాధ్యత అని అన్నారు. పదవుల కోసం రాజకీయాలకు రాలేదన్నారు. పదవులు ఉన్నా లేకపోయినా ప్రజా సేవకే నా జీవితం అంకితం చేస్తానని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. బీఆర్‌ఎస్‌ నాయకులు జక్కుల తిరుపతి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్‌ నడిపెల్లి అభిషేక్‌ రావు, నాయకులు కౌశిక హరి, ప్యాక్స్‌ చైర్మన్‌ మామిడాల ప్రభాకర్‌, కార్పొరేటర్లు బాల రాజ్‌ కుమార్‌, నారాయణదాసు మారుతి, తోడేటి శంకర్‌ గౌడ్‌, చెలుకలపల్లి శ్రీనివాస్‌, జెవి రాజు, సింహాచలం రత్నాకర్‌, దొమ్మెటి వాసు, చెలుకలపల్లి సతీష్‌, అల్లి గణేష్‌, దండు రవి, రాజన్నల సంఘం బాధ్యులు మెరుగు గట్టయ్య, మొగిలి మల్లేష్‌ తదితరులున్నారు.
గోలివాడలో ఎమ్మెల్యే పల్లెనిద్ర
ప్రజా అంకిత యాత్రలో భాగంగా సోమవారం అంతర్గాం మండలం గోలివాడలో రాత్రి పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టారు. మంగళవారం ఉదయం గ్రామంలో ప్రజ అంకిత యాత్ర నిర్వహించారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మహిళలు అధిక సంఖ్యలో హాజరై మంగళ హారతులతో, కోలాటం ప్రదర్శనతో ప్రజా అంకిత యాత్రను ఎమ్మెల్యే చందర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు జరిగిన తరువాత పదేళ్ల సిఎం కెసిఆర్‌ పాలనలో వందేళ్ల ప్రగతి సాధించామన్నారు. కార్యక్రమంలో అంతర్గాం జడ్పీటీసి అముల నారాయణ, గోలివాడ గ్రామ సర్పంచ్‌ ధరని రాజేశ్‌, వైస్‌ ఎంపీపీ మట్ట లక్ష్మి మహేందర్‌ రెడ్డి, సర్పంచ్‌లు బండారి ప్రవీన్‌, బాదరవేని స్వామి, తుంగపిండి సతీశ్‌, గుమ్ముల రవీందర్‌, జిల్లా కో ఆప్షన్‌ సభ్యులు దివాకర్‌, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు తిరుపతి నాయక్‌, నాయకులు కుర్ర నూకరాజు, కొల్లురి సతీష్‌ పాల్గొన్నారు.

Spread the love