ఈవీఎం గోడౌన్ ను పరిశీలించిన కలెక్టర్

నవతెలంగాణ- కంఠేశ్వర్:
జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ లో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం పరిశీలించారు. సాధారణ పరిశీలనలో భాగంగా ఈవీఎం గోడౌన్ ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. బ్యాలెట్ యూనిట్ లు, కంట్రోల్ యూనిట్లు, వి.వి.ప్యాట్లు, భద్రపరచి ఉన్న ఇతర ఎన్నికల సామాగ్రి వివరాలతో కూడిన రికార్డులను తనిఖీ చేశారు. ఈవీఎంలు, బ్యాలెట్ యంత్రాల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, అనుకోని రీతిలో ప్రమాదాలు సంభవించిన సమయాల్లో తక్షణ చర్యలు చేపట్టేందుకు అవసరమైన అగ్నిమాపక సామగ్రి, ఇతర పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్ సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.
Spread the love