నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్: జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఉన్న ఈవీఎం గోదామును అలాగే కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సింబల్ లోడేడ్ యూనిట్ స్టోరేజ్ లను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన మంగళవారం పరిశీలించారు. జిల్లా కలెక్టర్ వెంట పార్లమెంటు నియోజకవర్గం సహాయ రిటర్నింగ్ అధికారి నటరాజ్ తదితరులు ఉన్నారు.