రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి: కలెక్టర్

Farmers should be ensured that there is no trouble: Collectorనవతెలంగాణ – పెద్దవంగర
రైతులకు ఇబ్బందులు లేకుండా సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. మండల కేంద్రంలో పీఏసీఎస్, ఐకేపీ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి రైతులతో మాట్లాడి, కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలపై ఆరా తీశారు. అధికారులు, రైతులకు మ్యచ్ఛర్, వచ్చే విధంగా ఎలా చర్యలు తీసుకోవాలో అవగాహన కల్పించాలన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ..రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహించాలన్నారు. కేంద్రాలలో మౌలిక వసతులు త్రాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, సౌకర్యాలు కల్పించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 226 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని రైతులకు సూచించారు. దళారులను ఆశ్రయించి మోసపోవద్దని చెప్పారు. నాణ్యతా ప్రామాణాలు పాటించాలని, శుద్ధి చేసిన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకు రావాలని అన్నారు. 40 కిలోల 600 గ్రాములు తూకం వేయాలన్నారు. కేంద్రాల్లో విక్రయించి ప్రభుత్వ మద్దతు ధరను పొందాలన్నారు. సన్న రకం ధాన్యానికి ప్రభుత్వం రూ.500 బోనస్‌ చెల్లిస్తోందన్నారు. పట్టాదారు పుస్తకం, ఆధార్‌ కార్డు జిరాక్స్‌ లను వెంట తెచ్చుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలు చేయగానే వెంటనే ఆన్లైన్ పూర్తి చేసి, రైతుల ఖాతాలో నగదు జమ చేసే ప్రయత్నం చేయనున్నారు. కొనుగోలు  నిర్వాహకులు కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఆదేశించారు. కేంద్రాల్లో అవకతవకలు చోటు చేసుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి, పిల్లలకు అందిస్తున్న పోషక ఆహార వివరాలు అడిగి తెలుసుకున్నారు. శ్యామ్, మ్యామ్, పిల్లల కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.ఘ కార్యక్రమంలో డీఆర్డీవో మధుసూదన్ రాజు, డీసీవో వెంకటేశ్వర్లు, డీఎస్ఓ ప్రేమ్ కుమార్, తహశీల్దార్ వీరగంటి మహేందర్, ఎంపీడీవో వేణుమాధవ్, ఏపీఎం రమణాచారి, మండల వ్యవసాయ అధికారి గుగులోత్ స్వామి, పీఏసీఎస్ సీఈవో మురళీ, సెంటర్ నిర్వాహకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love