ధరణిలో పెండింగ్ ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

Applications pending in Dharani should be disposed of immediately: Collectorనవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ధరణి మాడ్యూల్స్ లో ఉన్న పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం మినీ మీటింగ్ హాల్ లో జిల్లా రెవిన్యూ డివిజనల్ అధికారులు, మండల తహసీల్దార్ లకు మార్గ నిర్దేశం చేశారు. ధరణి, మీసేవ, షాదిముబారక్, కల్యాణలక్ష్మి, ఓటరు నమోదుపై రివ్యూ నిర్వహించడం జరిగింది. రెవిన్యూ యాంత్రాగం జరగకుండా, ప్రధాన భూమిక పోషించాలన్నారు. ధరణి మాడుల్స్ లో ఉన్న దరఖాస్తుల పరిష్కారానికి చేపడుతున్న చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి క్లియర్ చేయాలని అన్నారు. అన్ని మాడ్యుల్స్ లో దాఖలైన ధరణి దరఖాస్తులను పెండింగ్ ఉంచకుండా వెంటనే పరిష్కరించేందుకు చొరవ చూపాలని మండల తహసీల్దార్లను ఆదేశించారు. ధరణి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. ఇప్పటివరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయని, వాటిలో ఎన్ని పరిష్కరించారు. ఇంకా ఎన్ని పెండింగ్ ఉన్నాయని ఆరా తీశారు. పెండింగ్ ఉన్న దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రణాళిక బద్ధంగా కృషి చేయాలని అధికారులకు సూచించారు. సక్సేషన్, పెండింగ్ మ్యూ టేషన్ వంటి దరఖాస్తులను అవసరమైన రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే పరిష్కరించాలని, డేటా కరెక్షన్ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన తర్వాతే పరిష్కరించాలని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటర్ నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ)వీరారెడ్డి, భువనగిరి ఆర్డి ఓ కృష్ణారెడ్డి చౌటుప్పల్ ఆర్డిఓ శేఖర్ రెడ్డి, మండలం తహసీల్దార్ లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Spread the love