నవతెలంగాణ-పాలకుర్తి
నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి అవ కాశాలు కల్పించేందుకు మంత్రి ఎర్రబెల్లి దయాక ర్ రావు సహకారంతో రా ష్ట్ర ప్రభుత్వంచేపట్టిన జాబ్ మేళాను విజయవంతం చేయాలని కలెక్టర్ సిహెచ్ శి వలింగయ్య ప్రజా ప్రతి నిధులను,అధికారులను ఆదేశించారు.మంగళవారం మం డల కేంద్రంలోగల బం దావన్ గార్డెన్‌ను జిల్లా అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్‌తో కలిసి ఆయన సందర్శించి జాబ్ మేళా ఏర్పాట్లను పరిశీలించారు.అనంతరం మా ట్లాడుతూ పాలకుర్తిలో గల యువతి యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేం దుకు జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని తెలిపారు. 13 వేల మందికి ఉపాధి అవ కాశాలు కల్పించేందుకు 80 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటారని తెలిపారు. ప్రజాప్రతి నిధులు, అధికారులు సమన్వయంతో పని చేసి జాబ్ మేళాను విజయ వంతం చేయాలని తెలిపారు. ఈకార్యక్రమంలో డిఆర్డి ఓ రామ్ రెడ్డి, ఎంపీపీ నల్ల నాగిరెడ్డి, జెడ్పి ఫ్లోర్ లీడర్ పుషఉ్కరి శ్రీనివాసరావు, డిపిఓ రంగాచారి, బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, సర్పంచు వీరమనేని యాకాంతరావు, జిల్లా కో ఆప్షన్ సభ్యులు ఎండి మదర్, ఐలమ్మ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ముస్కు రాంబాబు, ఏపీఎం లు నరేందర్, రాచకొండ రమణాచారి పాల్గొన్నారు.