కేసీఆర్ కు మరో భారీ షాక్.. నోటీసులు జారీ చేసిన కమిషన్

నవతెలంగాణ-హైదరాబాద్ : యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ విద్యుత్ కేంద్రాల నిర్మాణంతో పాటు ఛత్తీ‌స్ గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై నిర్ణయాల్లో భాగస్వాములైన ప్రస్తుత, మాజీ అధికారులను జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి కమిషన్‌ గతకొద్ది రోజులుగా విచారిస్తోంది. దీనిలో భాగంగా ఛత్తీ‌స్ గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో తాజాగా మాజీ సీఎం కేసీఆర్ కి నోటీసులు జారీ అయ్యాయి. కేసీఆర్ కి జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి నోటీసులు పంపారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో కేసీఆర్ పాత్రపై కమిషన్‌ వివరణ కోరింది. ఈ నెల 30వ తేదీలోపు వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా, కేసీఆర్ జులై 30 వరకు సమయం కోరడం జరిగింది. ఇక ఇప్పటికే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పరాజయంతో సతమతమవుతున్న బీఆర్ఎస్ అధినేతకు ఇప్పుడు ఈ నోటీసులు జారీ కావడం మరో గట్టి షాక్ అనే చెప్పాలి.

Spread the love