డాక్టర్ల నిర్లక్ష్యంతో ప్రాణాపాయ స్థితిలో యువతి..బంధువుల ఆందోళన

నవతెలంగాణ-హైదరాబాద్ : మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా మల్లారెడ్డి ఆస్పత్రి డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఓ యువతి ప్రాణాపాయ స్థితిలో పడింది. కిడ్నీలో రాళ్లు ఉన్నాయని, మాధవి (28) అనే యువతికి డాక్టర్లు శస్త్రచికిత్స నిర్వహించారు. అయితే, ఆమెకు తీవ్ర రక్తస్రావమవడంతో ప్రాణాపాయ స్థితిలోకి ఉంది. ఆ విషయాన్ని దాచిపెట్టి, వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు సాకులు చెబుతున్నారని ఆమె బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మాధవికి తీవ్ర రక్తస్రావమైందని ఆరోపిస్తున్నారు. ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకొని పరిస్థితిపై ఆరా తీస్తున్నారు.

Spread the love