– ఎనగుర్తిలో నూతన బీఆర్ఎస్ పార్టీ కమిటీలు
– ఐక్యతతో ఎమ్మెల్యే అభ్యర్థి ని గెలిపిస్తాం
నవతెలంగాణ-దుబ్బాక రూరల్
మెదక్ ఎంపీ ఆదేశానుసారం అక్బర్ పేట భూంపల్లి మండలంలోని ఎనగుర్తి గ్రామంలో గురువారం నూతనంగా బీఆర్ఎస్ పార్టీ యూత్, సోషల్ మీడియా, విద్యార్థి విభాగం కమిటీలను వేశారు.ఈ కమిటీల్లో యూత్ అధ్యక్షుడిగా సిర్రం రాజు,సోషల్ మీడియా అధ్యక్షుడు కొయ్యడ అనిల్ గౌడ్,విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా చిన్న ముత్యాల రాజులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా దుబ్బాక బిఆర్ఎస్వీ నియోజకవర్గ ఇంచార్జి పాపని సురేష్ గౌడ్, గ్రామశాఖ అధ్యక్షుడు శంకరయ్య మాట్లాడుతూ రానున్న రోజుల్లో దుబ్బాకలో ప్రతి పక్ష పార్టీలకు “టూ లేట్ “బోర్డ్ లు తగిలించుకునే పరిస్థితి రానుందన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి ఎనగుర్తి గ్రామం నుంచి ఐక్యతగా పని చేసి అత్యధిక మెజార్టీతో సత్తా చాటడం ఖాయమన్నారు.తిరిగి దుబ్బాకలో బీఆర్ఎస్ జెండా ఎగరడమే లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల భాద్యులు దమ్మగౌని ప్రశాంత్ గౌడ్ ,జులూరి అరవింద్, పడాల రాజు, గ్రామ స్థానిక సర్పంచ్ గుండా శంకర్, ఉప సర్పంచ్ స్వామి,మార్కెట్ కమిటీ డైరెక్టర్ దేవరాజ్,మాజీ సర్పంచ్ లింభాద్రి గౌడ్, ముక్క వెంకటపతి,కమటం లక్ష్మి నారాయణ కమటం వెంకటస్వామి ,లింగం షాబుద్దిన్,తదితరులు పాల్గొన్నారు.