నవతెలంగాణ – బెజ్జంకి
దంపతులిద్దరు మద్య గొడవ తలెత్తడంతో పురుగుల మందు సేవించి ఆత్మహత్య పాల్పడిన కూలీ చికిత్స పొందుతూ విషమించి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని పోతారం గ్రామ శివారులో కోళ్లఫాం యందు శనివారం చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు అదిలాబాద్ జిల్లాకు చెందిన దశరథ్(40),భార్య సంగోలి(35) ముగ్గురు పిల్లలతో కలిసి మూడు సంవత్సరాల క్రితం పోతారం గ్రామ శివారులోని గోపాల్ రెడ్డి యొక్క కోళ్ల ఫాం యందు కాలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. మే 30న దశరథం ఆనారోగ్యానికి గురవ్వగా చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లి తిరిగివచ్చారు. అనంతరం తిరిగి చికెన్ వండి ఇవ్వమంటూ భార్యతో దశరథం గొడవపడగా భార్య డాక్టర్ తినవద్దన్నాడంటూ బదులివ్వడంతో దంపతులిద్దరి మద్య గొడవ తలెత్తింది. దశరథం గుర్తుతెలియని పురుగుల మందు సేవించి ఆత్మహత్య పాల్పడగా చికిత్సకు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడు చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడని మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.