– అల్పాహార కార్యక్రమం వెంటనే పునరుద్దించాలి
నవతెలంగాణ – బొమ్మలరామారం
విద్యార్థుల నోటికాడ ముద్దును లాక్కున్న కాంగ్రెస్ ప్రభుత్వమని బీఆర్ఎస్ నాయకులు, విద్యా సంఘాల నాయకులు శుక్రవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు.బొమ్మలరామారం మండలంలోని మర్యాల గ్రామంలో మాజీ బీ ఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులకు అల్పాహార కార్యక్రమాన్ని మర్యాల గ్రామం నుండి ప్రారంభించడం జరిగిందని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటినుండి అల్పాహారం అందజేయడం లేదని వెంటనే పునరుద్దించాలని డిమాండ్ చేశారు.జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముందు నిరసన తెలిపారు. అల్పాహార పథకం పైలెట్ ప్రాజెక్టుగా మర్యాల స్కూల్ నుండే ప్రారంభించారని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల నోటికాడి కూడును లాక్కుంటుందని వారు మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మన్నె శ్రీధర్, గ్రామ శాఖ అన్నారం గణేష్, మాజీ వైస్ ఎంపీపీ కూకుట్ల శ్రీశైలం,సోషల్ మీడియా కన్వీనర్ కోండ్ర సాయికుమార్, టిఆర్ ఎస్పీ అధ్యక్షులు బాల్ సింగ్, నాయకులు మచ్చ శ్రీనివాస్ గౌడ్, రాములు, మల్లేష్, పరశురాం, రాంబ్రహ్మం, శ్రీనివాస్ చారి, నవీన్, భాస్కర్, అనిల్, సాయికుమార్, భాను, జమ్లాల్, బాల్ సింగ్, తదితరు నాయకులు పాల్గొన్నారు.