నవతెలంగాణ – అశ్వారావుపేట
ఇటీవల కాంగ్రెస్ లో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ను అశ్వారావుపేట కాంగ్రెస్ అద్యక్షులు మొగళ్ళపు చెన్నకేశవరావు సోమవారం గండుగులపల్లి లోని తుమ్మల స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసారు.ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పేట లో పలు రాజకీయ అంశాలు పై చర్చించారు. ఆయన వెంట ఎం.పి.టి.సి లు వేముల భారతి ప్రతాప్, సత్యవరపు తిరుమల బాలగంగాధర్, దేవరాజు, మందపాటి వెంకన్న బాబు ఉన్నారు.