కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ట్రైలర్ మాత్రమే చూపింది

కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ట్రైలర్ మాత్రమే చూపింది ముందు ముందు పూర్తిస్థాయిలో 70ఎంఎం చూపిస్తాం
– రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు
నవతెలంగాణ:మల్హర్ రావు:-
కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ట్రైలర్ మాత్రమే చూపించిందని,ముందు ముందు పూర్తిస్థాయిలో 70ఎంఎం చూపిస్తామని తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మంథని నియోజకవర్గంలోని ముత్తారం మండలంలో పలు గ్రామాల్లో పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ తరపున ఆయన ప్రచారం నిర్వహించి, పలు దేవాలయంలో పత్రిక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.ఓడేడ్ మానేరు వాగులో ఇటీవల గాలి బీభత్సంతో కూలిన వంతెనను సందర్శించారు.అనంతరం మండలంలోని మచ్చుపేట, పోతారం, మైదంబండ గ్రామాలలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అత్యధిక మెజార్టీతో గడ్డం వంశీ ని గెలిపించాలని, ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.మొదటి దఫాలో స్థలం ఉండి ఇల్లు లేని వారికి, రెండో దఫాలో ఇళ్ల నిర్మాణానికి భూ సేకరణ చేపడతామన్నారు.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటామన్నారు.మానేరు వాగు పై నిర్మించిన వంతెన కూలిపోయిన విషయంలో కెసిఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.ఎవరి పని వారు చేస్తేనే చక్కటి ఫలితం ఉంటుందని ఆయన అన్నారు. మానేరు వంతెన నిర్మాణం నాసిరకం పనులతో చేపట్టారని, వంతెన నిర్మాణంలో సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. లక్ష కోట్లతో చేపట్టిన కాలేశ్వరం ప్రాజెక్టు కృంగిపోయింది, ఓడేడు మానేరు వాగు లో నిర్మించిన వంతెన గాలికి పడి పోయింది. వంతెన కూలిన ఘటనలో ముఖ్యమంత్రి ఆర్ అండ్ బి శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లామని, సంబంధిత కాంట్రాక్టర్ అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. మంథని నియోజకవర్గంలో ముందు ముందు కచ్చితంగా 70 ఎంఎం సినిమా చూపిస్తామన్నారు.ముత్తారం మండలం కు విచ్చేసిన దుద్దిళ్లకు, పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీ కి ఘనంగా స్వాగతం పలికి శాలువాలతో సన్మానం చేశారు.

Spread the love