నవతెలంగాణ – అచ్చంపేట
అచ్చంపేటలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ నీచమైన సాంస్కృతిని అవలంబింపజేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆరోపించారు. ఉద్యమ నాయకుడు, మున్సిపల్ చైర్మన్ నరసింహ గౌడ్ పై అవిశ్వాస తీర్మానం పెట్టడం కాంగ్రెస్ నైతిక చర్య అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గువ్వల బాలరాజు మాట్లాడారు. బీసీ బిడ్డను పదవి నుండి దింపి ఉన్నత వర్గానికి కట్టపెట్టడం సమంజసం కాదన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజల మద్దతు మాకే ఉంది, అందుకే కాంగ్రెస్ పార్టీనే గెలిపించారంటూ ప్రగల్బాలు పలుకుతున్న అచ్చంపేట ఎమ్మెల్యే ప్రజల మద్దతుతోనే మున్సిపల్ పీఠాన్ని గెలుచుకోవాలి కానీ, పార్టీ ఫిరాయింపులతో కాదని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ అక్రమ వసూళ్లు, ఇసుక దందాలకు పాల్పడుతూ సంక్షేమానికి సంక్షోభం చేస్తున్నారన్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ గెలిచిన నాటినుండి నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు, దాడులు చేస్తున్నారనీ మండి పడ్డారు. అవిశ్వాస తీర్మానం పెడితే పెట్టారు కానీ ..చైర్మన్ పీఠాన్ని మాత్రం అగ్ర కులాలకు కాకుండా, అణగారిన వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు రమేష్ రావు, కుత్బుద్దీన్, కేటి తిరుపతయ్య, చెన్నకేశవులు, చారకొండ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్, నాయకులు అమీనొద్దీన్, శంకర్ మాదిగ, గంట్ల సురేష్, పాల్గొన్నారు.