కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలి..

– తొమ్మిదేళ్లుగా బీఆర్ఎస్ అవినీతిలో కూరుకుపోయింది..
– మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ భూపతి రెడ్డి.
నవతెలంగాణ – డిచ్ పల్లి
కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసు కొచ్చేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని, మాజీ ఎమ్మెల్సీ నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ ఇన్చార్జి, డాక్టర్ రెకులపల్లి భూపతిరెడ్డి అన్నారు.అదివారం ఇందల్ వాయి మండలంలోని నల్లవెల్లి గ్రామంలో మండలా కాంగ్రెస్ కార్య కర్తల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి ఆదరణ పెరుగు తోందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత తొమ్మిదేళ్లుగా బీఆర్ఎస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉన్నారని నేడు ఇన్ని వర్గాల ప్రజలు ఎన్ని చెప్పుకోలే విధంగా ఇబ్బందులు పడుతున్నారని ప్రతి కార్యకర్త గ్రామాలకు వెళ్లి ప్రతి ఇంటింటికి తిరుగుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రావాలనిపిస్తున్న ప్రజా ప్రతిరేఖ విధానాలను వివరించాలన్నారు. కర్ణాటకలో అక్కడి ప్రజలు బిజెపి పార్టీకి గంగలో కలిపారని అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో సైతం గంగా లో కలపడానికి సిద్ధంగా ఉన్నారని దానికోసం ప్రతి కార్యకర్త సైనికులుగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు రూరల్ ఇంచార్జ్ భూపతిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నల్లవెల్లి స్టేషన్ తాండ, మేగ్య నాయక్ తండా, కేకే తాండ, వెంగలపాడ్ గ్రామానికి సంబంధించిన బిఅర్ఎస్ కార్యకర్తలు భూపతి రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతకుముందు మండల గ్రామాల నాయకులు కార్యకర్తలు, టీపీసీసీ ఉపాధ్యక్షులు తాహెర్ బిన్ బిన్ హందన్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, నిజామాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్,కాటి పల్లి నాగేశ్ రెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, కిసాన్ కేత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి అవలంబిస్తున్న తీరును ఎండగట్టారు.ఈ కార్యక్రమం లో ఇందల్వాయి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోత్కూరి నవీన్ గౌడ్, కిసాన్ ఖేత్ మండల అధ్యక్షుడు ఎల్ఐసి గంగాధర్, డిసిసి డెలిగేట్ వెంకటరెడ్డి, డిసిసి డెలిగేట్ సుధాకర్,బ్లాక్ కాంగ్రెస్ సంతోష్ రెడ్డి, సురేందర్ రెడ్డి, లారీ గంగారెడ్డి, దండ్ల రాజన్న, ఎంపీ గంగన్న, హబిబ్, బైరయ్య, కరుణాకర్, జమీల్ పాషా, గంగామణి, బాబురావు, శ్రీనివాస్ ,అంబర్ సింగ్ ,రాయ సింగ్, బద్దం రెడ్డి, గంగ నరసయ్య, వసంతరావు, నారాయణ, సాయందర్, శంశుద్దీన్ ,మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love