అత్తను తుపాకితో కాల్చి చంపిన కానిస్టేబుల్

నవతెలంగాణ- హనుమకొండ: హనుమకొండ జిల్లా కేయూ పోలీసు స్టేషన్ పరిధిలోని గుండ్ల సింగారంలో కాల్పుల కలకలం సృష్టించింది. అత్తను కానిస్టేబుల్ అడ ప్రసాద్ తన సర్వీస్ రివాల్వర్తో కాల్చి చంపాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా హనుమకొండ జిల్లా ఉలిక్కిపడింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. రూ.5 లక్షల కోసం కొంతకాలంగా అత్త, అల్లుడు మధ్య ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి. కాగా గురువారం గొడవ పెరగడంతో ప్రసాద్ తుపాకీతో అత్తను కాల్చడంతో చనిపోయింది. అక్కడే ఉన్న స్థానికులు అతడిని పట్టుకొని చితకబాదారు. కానిస్టేబుల్ ప్రసాద్ రామగుండం కమిషనరేట్ కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో పని చేస్తున్నాడు.

Spread the love