రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు పక్కాగా పాటించాలి: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

నవతెలంగాణ – హైదరాబాద్‌: రాజ్యాంగ రూపకర్తలు ఎంతో కష్టపడి రాజ్యాంగాన్ని రూపొందించారని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజయ్‌ పాల్‌ తెలిపారు. గణతంత్ర వేడుకల సందర్భంగా హైకోర్టు ప్రాంగణంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. రాజ్యాంగాన్ని పక్కాగా పాటించడంతో పాటు రక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని చెప్పారు. పెండింగ్ కేసులు న్యాయమూర్తులకు సవాల్ లాంటివని.. న్యాయవాదుల సహకారంతో వాటిని పరిష్కరిస్తున్నామని తెలిపారు. గతేడాది జనవరిలో 2.31 లక్షల పెండింగ్ కేసులుంటే.. వాటిని 2.29 లక్షలకు తగ్గించినట్లు వివరించారు.

Spread the love