నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
దేశ ఆర్థిక వ్యవస్థకు సహకార వ్యవస్థ వెన్నుముక లాంటిదని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ తెలిపారు. నేషనల్ కో ఆపరేటివ్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్‌సీయూఐ) ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లో సహకార అభివృద్ధిపై దక్షిణాది రాష్ట్రాల ఒక రోజు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ సహకార రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు ప్రధాని మోడీ సహకార రంగానికి ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ఎన్‌సీయూఐ అన్ని రంగాల వారికి శిక్షణ ఇస్తూ ప్రోత్సహిస్తున్నదని కొనియాడారు. ఈ సమావేశంలో ఎన్‌సీయూఐ అధ్యక్షులు దిలీప్ సంఘానీ, టీఎస్ మార్క్‌ఫెడ్ చైర్మెన్ ఎం.గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.