నతెలంగాణ – నేపాల్: హిమాలయ దేశం నేపాల్‌లో మరోసారి భూకంపం వచ్చింది. గురువారం తెల్లవారుజామున 1.20 గంటలకు మక్వాన్‌పూర్ జిల్లాలో భూమి కంపించింది. దీని తీవ్రత 4.5గా నమోదయిందని నేపాల్ సీస్మోలజికల్ సెంటర్ తెలిపింది. భూకంప కేంద్రం చిట్లాంగ్‌లో ఉన్నదని వెల్లడించింది. అర్ధరాత్రి వేళ భూమి కంపించడంతో ప్రజలు వణికిపోయారు. ఇండ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.