విజయవంతంగా చివరి దశకు చేరిన కౌంటి వెలుగు కార్యక్రమం..

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం ఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విజయవంతంగా చివరి దశకు చేరుకుంటుందని కంటి వెలుగు వైద్యురాలు వరలక్ష్మి శుక్రవారం తెలిపారు.ఈ కంటి వెలుగు కార్యక్రమంలో 18 సంవత్సరాలు పైబడిన వారికి చికిత్స చేస్తున్నామని ఆమె వివరించారు.గ్రామం మొత్తం 2100 మందిని లక్ష్యంగా పెట్టుకొని ప్రభుత్వం ద్వారా ఉచిత కంటి శిబిరం నిర్వహిస్తున్నామని ఇప్పటి వరకు 800 మందికి చికిత్సను అందించడం జరిగిందన్నారు. ఈ కంటి వెలుగు కార్యక్రమము 13 జూన్ వరకు జరుగు తుందని వైద్యాధికారి డాక్టర్ వరలక్ష్మి తెలిపారు. ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు, యువకులు, వృద్ధులు, మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఇందల్ వాయి ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలోనే తిర్మన్ పల్లి కంటి వెలుగు కార్యక్రమం చిట్ట చివరిదని వరలక్ష్మి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఆరోగ్య విస్తరణ అధికారి వై.శంకర్, ఆప్తాల్మిక్ అధికారులు ప్రకాష్, లికిత, డేటా ఎంట్రీ ఆపరేటర్ అనిల్, ఆరోగ్య కార్యకర్తలు అరుంధతి, భానుప్రియ, ఆశా కార్యకర్తలు పాశం జ్యోతి,బండ ప్రమీల, ప్రియాంక తోపాటు తదితరులు పాల్గొన్నారు.

Spread the love