ప్రేమ వివాహం.. అంతలోనే దంపతలు మృతి

నవతెలంగాణ – హైదరాబాద్: కులాలు వేరైనా కలకాలం కలిసుందాం అని మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అంతలో ఏం జరిగిందో ఏమో తెలియాదు గాని.. మూడు నెలలకే తనువు చాలించారు. వివరాలోకి వెలితే.. ఘటన రామగిరి మండలం గంగంపల్లిలో నిన్న చోటుచేసుకుంది. ఆ గ్రామానికి చెందిన దాదా (30), జ్యోత్స్న (26)లు కొంతకాలంగా ప్రేమించుకొని మూడు నెలల క్రితం ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుని తిరిగి గ్రామానికి వచ్చారు. ఇరు కుటుంబాల్లో కొద్ది రోజులు స్వల్ప వివాదం నెలకొన్నా.. చివరికి వారిని ఒప్పించి దాదా ఇంట్లోనే ఉంటున్నారు. ఇంతలోనే బుధవారం సాయంత్రం తోటకు వెళ్లి వస్తామని చెప్పిన ఇద్దరు వారి తోటలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు అసలైన కారణాలేమీ తెలియరాలేదు.

Spread the love