తల్లికి కుమార్తె భరణం ఇవ్వాలి: కోర్టు తీర్పు

నవతెలంగాణ – హైదరాబాద్: తల్లిదండ్రుల ఆస్తిలో వాటా కోరే కుమార్తెకు వారి ఆలనాపాలనా చూసుకోవాల్సిన బాధ్యతా ఉందని ఇండోర్ కోర్టు తీర్పు ఇచ్చింది. కుమార్తె ఇంటి నుంచి తరిమేయడంపై తల్లి(78) కోర్టును ఆశ్రయించారు. తండ్రి మృతితో తల్లిని ఇంటికి ఆహ్వానించిన కుమార్తె.. వారసత్వంగా వచ్చిన ఇంటిని అమ్మించి, తండ్రి PF డబ్బునూ తీసుకుని లాక్‌డౌన్‌లో గెంటేసింది. పోషించే స్తోమత ఉన్న కుమార్తె నెలకు రూ.3వేలు తల్లికి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

Spread the love