తిరుమలలో భారీగా తగ్గిన భక్తుల రద్దీ…

నవతెలంగాణ – తిరుమల
తిరుమలలో భక్తుల రద్దీ నేడు (బుధవారం) దాదాపుగా తగ్గిపోయింది. నేడు స్వామివారి సర్వదర్శనానికి వెళితే కేవలం 3 గంటల్లో దర్శనం పూర్తి అవుతుంది. 1 కంపార్టుమెంట్‌లో మాత్రమే భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. మంగళవారం 69,143 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.38 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 26,145 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

Spread the love