రైల్వే శాఖ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం

– రైల్వే శాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి-
సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు,నెల్లూరి
నవతెలంగాణ-మణుగూరు
రైల్వే శాఖ నిర్లక్ష్యం కారణంగానే ఒడిశాలోని బాలసూర్‌ జిల్లాలో బహనాగ రైల్వే స్టేషన్‌ సమీపంలో ప్రమాదం జరిగిందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ రాజీనామా చేయాలని సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు నెల్లూరి నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. ఆదివారం స్థానిక శ్రామిక భవనంలో ముఖ్య కార్యకర్తల సమావేశం బొల్లం రాజు అధ్యక్షతన జరిగిందిజ ఒడిశాలో జరిగిన రైలు ఘటన అమరులకు నివాళులర్పించారు. రైల్వే శాఖ నిర్లక్ష్యం కారణంగానే దుర్ఘటన జరిగిందన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు కూడా ఈ ప్రమాదం జరిగేందుకు కారణమని తెలిపింది. ప్రమాద ఘటనలో ఇప్పటివరకు రైల్వేలో ఆధునికరంలో భాగంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తాయని విమర్శించారు. వేలాది మంది ప్రయాణికులు ప్రాణాలు గాలిలో కలిసి పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైల్వే స్టేషన్‌లో సౌకర్యాల కోసం కోట్లు ఖర్చు పెడుతున్నారని తెలిపారు. అదే సమయంలో రైల్వే లైన్‌లో సిగల్‌ వ్యవస్థ ట్రాకులు ఆధునీకరణ చేపట్టకపోవడం శోచనీయమని విమర్శించారు. ఈ సమావేశంలో మండల కార్యదర్శి వర్గ సభ్యులు లెనిన్‌ బాబు, సత్ర పల్లి సాంబశివరావు, ఉపతల నరసింహారావు, బొల్లం రాజు, గుర్రం నరసయ్య నరసయ్య పాల్గొన్నారు.

Spread the love