ఫోన్‌తో ప్రమాదమే.. ఇంటర్ పరీక్షలపై ఫోన్‌ ప్రభావం..

– గత సంవత్సరంలో జరిగిన సంఘటనలతో అప్రమత్తమవుతున్న అధికారులు
నవతెలంగాణ –  సూర్యాపేట కలెక్టరేట్
టెన్త్,ఇంటర్ బోర్డ్ పరీక్షల నిర్వహణకు సెల్‌ ఫోన్ లు ముప్పుగా మారాయి.గతేడాది పదో తరగతి పరీక్షల సమయంలో గతేడాది  రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో  జరిగిన ఘటనలే ఇందుకు నిదర్శనం. పరీక్షలకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేసినా.స్మార్ట్‌పోన్ల ద్వారా గతేడాది ప్రశ్నాపత్రాలు బయటకు రావడం రాష్ట్రంలో అప్పట్లో సంచలంగా మారింది. దీనిపై గత ప్రభుత్వం కూడా సీరియస్‌గా స్పందిం చింది. త్వరలో టెన్త్, ఇంటర్‌ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ప్రశ్నాపత్రాలు లీక్‌ కాకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఈ నెల చివర నుంచి పరీక్షలు: ఇంటర్మీడియట్‌ పరీక్షలు ఈనెల 28వ తేదీ నుంచి జరగనున్నాయి.జిల్లాలో 16,602 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకారున్నారు. ఇందులో ఫస్టియర్‌ విద్యార్థులు 6,633 మంది, సెకండియర్‌ విద్యార్థులు 6,722 మంది పరీక్ష రాయనున్నారు. ఇందులోనే వృత్తి విద్యా కోర్సులో మొత్తం 3,247 ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 1,652, సెకండ్ ఇయర్ విద్యార్థులు 1,595 పంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.జిల్లా వ్యాప్తంగా 32 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మార్చి 18 నుంచి  పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానుండగా జిల్లాలో 345 పాఠశాలకు చెందిన 11,946 మంది రెగ్యూలర్‌ విద్యార్ధులు, 187 ప్రైవేటు విద్యారులు  మొత్తం 12,133 విద్యార్ధులు పరీక్షలకు హాజరుకానున్నారు.
ముందుగానే పేపర్లు బయటకు:  ప్రైవేటు పరీక్ష కేంద్రాల్లో కొందరు సిబ్బంది ప్రశ్నాపత్రాలను ముందుగానే ఫోటోలు తీసి బయటకు పంపిచించే అవకాశం ఉంటుంది. ఇన్విజిలేటర్లతో పాటు చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్లు సైతం సెల్‌ ఫోన్లు వినియోగించడం వల్ల ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుతo సంవత్సరం లో కూడా సెల్‌ఫోన్‌ నిషేధించారు.కానీ పరీక్ష సమయానికి 30 నిమిషాల పాటు ఏదైనా సందేహాలుంటే తెలుసుకునేందుకు ఫోన్లు వినియోగించే అవకాశం ఉంది.ఈ సమయంలో ప్రశ్నా పత్రాలు బయటకు వెళ్లే అవకాశం ఉంటుంది.కొన్ని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల ఒత్తిళ్లకు తలొగ్గి కొందరు అధికారులు ప్రశ్నాపత్రాలను సెల్‌పోన్ల  ద్వారా ఫొటోలు తీసి బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు.
ఫోన్లు నిషేధించాం, కృష్ణయ్య, డిఐఈవో: ఇంటర్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తాం. సెల్‌ ఫోన్లను నిషేధించడం జరిగింది.ఎవరైనా ఫోన్లు వాడితే కఠిన చర్యలు తీసుకుంటాం.ఇది వరకే సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించడం జరిగింది.అకస్మాత్తుగా తనిఖీలు చేస్తాం.
Spread the love